అదే భవిష్యత్ఏది కోల్పోయినా పర్వాలేదు కాని భవిష్యత్ పై ఆశ కోల్పోకూడదు !
Life is a journey Not a destination ... మార్పు ఆనేది ప్రకృ తి సహజధర్మం
Learn from yesterday, Live for today, Hope for tomorrow ... There is no wealth but life ... Every day may not be good, but there's something good in every day
అదే భవిష్యత్ఏది కోల్పోయినా పర్వాలేదు కాని భవిష్యత్ పై ఆశ కోల్పోకూడదు !
ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం. ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం, అది లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు
ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు
ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం
ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి
ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్ధం చేసుకున్న వాడు వివేకి
చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది
అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది
అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది
గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదలో ఉన్న బాణాల వల్ల కాదు
అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు
అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ
కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు. జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం
అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి. అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు
జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం
కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు
గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు – ఓపిక. గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
చిరునవ్వుతో కూడినవైఖరి ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు
నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే
నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు
నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు
తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది
తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం
దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది
చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి
దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది
మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.
చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి
చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి
మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది
మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు
అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం
విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.
వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది
మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే
మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.
మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం
విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు
విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే
మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే
మంచీ, చెడూ అనేదేదీ వేరు వేరు గా వుండవు . అవసరం మంచి ని , అవకాశం చెడు ని ప్రేరేపిస్తాయి
మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి
పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.
పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు
పనిచేయని వాడికి తినే హక్కులేదు
ప్రగల్బాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు
ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు
ప్రార్ధన చేసే పెదవులు కన్నా సేవ చేసే చేతులు మిన్న
ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు
పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి
పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం
బాధపడటం అనేది 'సోమరి లక్షణం' దాన్ని వదిలేయండి
బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు
బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు
బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు
భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం
రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు
వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న
చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు
చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది
స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి
లెండి! మేల్కొండి! గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి!
who am i
- kishore koney
- Sunnyvale, CA, United States
Blogging is all about sharing experiences. This is a small effort to share experiences in my comfort zone.
Most important , A Special Thanks to my parents(Sri Ramachandra Rao & Srimathi Nagamani), my wife(Roja), my lovely daughter (Hansini) and son (Harshil) for their inspiration and continuous support in developing this Blog.
... "Things will never be the same again. An old dream is dead and a new one is being born, as a flower that pushes through the solid earth. A new vision is coming into being and a greater consciousness is being unfolded ..." from Jiddu Krishnamurti's Teachings.
Now on disclaimer :
1. Please note that my blog posts reflect my perception of the subject matter and do not reflect the perception of my Employer.
2. Most of the times the content of the blog post is aggregated from Internet articles and other blogs which inspired me. Due respect is given by mentioning the referenced URLs below each post.
Have a great time
Failure is not falling down, it is not getting up again. Success is the ability to go from failure to failure without losing your enthusiasm
Where there's a Will, there's a Way. Keep on doing what fear you, that is the quickest and surest way to to conquer it
Vision is the art of seeing what is invisible to others. For success, attitude is equally as important as ability